టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా బుధవారం రాయచోటిలో మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, బడుగు బలహీన వర్గాలను జగన్ విస్మరించారని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లోని ఆంధ్రుల రక్షణ కోసం ప్రభుత్వం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ (హెల్ప్‌లైన్: 8500027678) ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ వంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఖాదర్ బాషా మండిపడ్డారు.