రాయచోటి: వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని మెరుగైన సేవలందించండి

2చూసినవారు
రాయచోటి: వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని మెరుగైన సేవలందించండి
అన్నమయ్య జిల్లా హోంగార్డ్స్ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో హోంగార్డ్స్ మొబలైజేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డ్స్ విధుల్లో చేరేముందు నేర్చుకున్న శిక్షణ అంశాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈ మొబలైజేషన్ ఒక గొప్ప అవకాశమని, సిబ్బంది తమ సామర్థ్యాలు, నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్