రాయచోటి: సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల నిఘా: ఎస్పీ

4చూసినవారు
రాయచోటి: సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల నిఘా: ఎస్పీ
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. మాల్‌ప్రాక్టీస్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మదనపల్లె, రాయచోటి సహా జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల పరిసరాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు మంగళవారం పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్