రాయచోటి డైట్‌లో సోమవారం ప్రారంభమైన బేసిక్ గైడ్ కెప్టెన్ల 7 రోజుల రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమంలో లీడర్ ఆఫ్ ది కోర్స్ కస్తూరి సుధాకర్ పాల్గొన్నారు. బాలికల్లో సేవాభావం, క్రమశిక్షణ, ధైర్యం, సాహసం పెంపొందించడంలో గైడ్ కెప్టెన్లు కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. బాలికలకు ఆదర్శప్రాయులుగా, ప్రేరణగా నిలిచి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అడ్వాన్స్ గైడ్ కెప్టెన్లు సుజాత, జిల్లాలోని 55 మంది బేసిక్ గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు.