రాయచోటి నియోజకవర్గవ్యాప్తంగా అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, మహిళా సమాఖ్య నేత సుమిత్ర డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటిలో వారు మాట్లాడుతూ, పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాల వల్ల మహిళలు, యువత తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు మండలాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.