రాయచోటి: మెరుగైన సమాజం కోసం ‘మనం’ కృషి ఎనలేనిది: డీఈఓ

6చూసినవారు
రాయచోటి: మెరుగైన సమాజం కోసం ‘మనం’ కృషి ఎనలేనిది: డీఈఓ
రాయచోటి డైట్‌లో ఆదివారం జరిగిన “మనం” సంస్థ సర్వసభ్య సమావేశంలో డీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్య, వైద్యం, జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణతో పాటు మెరుగైన సమాజం కోసం “మనం” సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. సంస్థ సభ్యులు పాఠశాలలో నేర్చుకున్న విలువలను సమాజానికి తిరిగి అందించాలనే నిబద్ధతతో పనిచేయడం విశేషమని అన్నారు. “మనం” సభ్యుడు దాసరి ఫణిధర్ చొరవతో అమెరికాకు చెందిన సేవా ఇంటర్నేషనల్ సంస్థ 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు.