రాయచోటి: డ్రగ్స్ వద్దు.. దేశమే ముద్దు-విద్యార్థుల ఈగల్ గర్జన

2చూసినవారు
రాయచోటి: డ్రగ్స్ వద్దు.. దేశమే ముద్దు-విద్యార్థుల ఈగల్ గర్జన
రాయచోటి పట్టణ పరిధిలోని ఓ ప్రవేట్ టెక్నికల్ కళాశాలలో 'ఈగల్ సెల్' ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు బుధవారం జరిగింది. డీఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ. మత్తు పదార్థాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని, NDPS చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 300 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్'లో భాగంగా నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :