రాయచోటి పోస్టల్ భవన నిర్మాణ స్థల పరిశీలన

5చూసినవారు
రాయచోటి పోస్టల్ భవన నిర్మాణ స్థల పరిశీలన
రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయ సముదాయ సమీపంలో పోస్టల్ శాశ్వత భవన స్థలాన్ని కర్నూలు పోస్ట్ మాస్టర్ జెనరల్ ఉపేంద్ర, ఉమ్మడి జిల్లాల ఏ ఎస్పీ రెడ్డి భాష, పోస్టల్ సిబ్బందితో శనివారం పరిశీలించారు. పాతకాలం నుండి స్థలం కేటాయించబడినప్పటికీ నిర్మాణం ఆలస్యం కావడంతో సిబ్బంది అద్దె భవనాల్లో పనిచేయాల్సి వస్తోంది. ప్రజలకు అందే సేవల్లో ఇబ్బందులు ఏర్పడినందున భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. భవనం అన్ని సేవలు సౌకర్యవంతంగా అందించే విధంగా నిర్మించబడుతోందని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :