రాయచోటి: భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజలు

5చూసినవారు
రాయచోటి: భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజలు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం రాహుకాల పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కృష్ణయ్య స్వామి ఆధ్వర్యంలో అర్చనలు జరిపి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, కార్యనిర్వాహణాధికారి డి. వి. రమణారెడ్డి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్