రాయచోటి పట్టణాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ చేపట్టిన ‘క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఎస్. ఎన్. కాలనీలో డ్రైనేజీ పూడికతీత పనులను తనిఖీ చేసిన ఆయన, గత 40 రోజుల్లో 95 కిలోమీటర్ల మేర పూడికతీత పూర్తయిందని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ప్రజలను కోరారు. నిర్లక్ష్యంగా చెత్త వేసే దుకాణాలు, ఇళ్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరిమానాలు విధిస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.