రాయచోటి: కుష్ఠు, టీబీ నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయాలి

3చూసినవారు
రాయచోటి: కుష్ఠు, టీబీ నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయాలి
అన్నమయ్య జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్. రాధిక బుధవారం రాయచోటిలోని సిబ్యాల సబ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుష్ఠు, ఎయిడ్స్, టీబీ వంటి వ్యాధుల నియంత్రణకు వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఆమె సూచించారు. కేంద్రంలోని టీబీ, కుష్ఠు కేసుల రికార్డులు, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్