సంబేపల్లి మండలం నాగిరెడ్డిగారిపల్లి పంచాయతీ సచివాలయంలో బుధవారం రీ సర్వే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి హాజరై, గ్రామ ప్రజలకు రీ సర్వే విధానం, భూ సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా భూ హక్కులను న్యాయబద్ధంగా నమోదు చేసేలా సూచనలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామసభ విజయవంతంగా ముగిసింది.