అన్నమయ్య జిల్లా క్రీడా అభివృద్ధిపై మంత్రి సమక్షంలో సమీక్ష

3చూసినవారు
అన్నమయ్య జిల్లా క్రీడా అభివృద్ధిపై మంత్రి సమక్షంలో సమీక్ష
మంగళవారం, రాయచోటిలో జిల్లా క్రీడా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై డీఎస్డిఓ & డీఎస్ఏ జి. చంద్రశేఖర్, రాష్ట్ర క్రీడలు–యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సమావేశం జరిగింది. డీఎస్ఏ కోసం రాయచోటి–మదనపల్లి రోడ్డులో 3 ఎకరాల భూమిపై మల్టీ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదనను మంత్రికి సమర్పించారు. మౌలిక సదుపాయాల లోపం, కోచ్ పోస్టుల ఖాళీలు, నిధుల సమస్యలను వివరించారు. జిల్లా క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్