అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, పోలీసు పిల్లలు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ధీరజ్ శుక్రవారం ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ, విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, కృషి ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎస్పీ సూచించారు.