అన్నమయ్య జిల్లాలో 2026 ఓటరు జాబితా సవరణకు ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, సీఈఓ వివేక్ యాదవ్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఆర్ఓలు, బీఎల్ఓల నియామకం, శిక్షణ, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.