గురువారం సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో దళితుల సమస్యలను సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు తెలుసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా దళితులు, గిరిజనులు అంటరానితనం, పేదరికం, భూమి, ఇళ్లలేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.