టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లు మార్చాలి: ఎస్టీయూ డిమాండ్

2చూసినవారు
టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లు మార్చాలి: ఎస్టీయూ డిమాండ్
ఈనెల 4 నుంచి జరిగే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాలను మార్చాలని ఎస్టీయూ నాయకులు శివారెడ్డి, మధుసూదన మంగళవారం డిమాండ్ చేశారు. నాన్ రెసిడెన్షియల్ శిక్షణ కావడం, ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడతారని డీఈఓ సుబ్రహ్మణ్యం, ఏపీసీ అనురాధలకు వినతిపత్రం ఇచ్చారు. సుండుపల్లి, వీరబల్లి మండలాలను రాజంపేటకు బదులు రాయచోటికి; గుర్రంకొండను పీలేరుకు బదులు మదనపల్లికి; పుల్లంపేట, పెనగలూరు మండలాలను రాజంపేట శిక్షణ కేంద్రానికి కలపాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్