ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: ఎస్పీ

3చూసినవారు
ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: ఎస్పీ
అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో తాత్కాలిక జాప్యం మాత్రమే జరిగిందని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పెట్రోల్ బంకుల వద్ద పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్