ఇంధన కొరతకు తావులేదు.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

4చూసినవారు
ఇంధన కొరతకు తావులేదు.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
అన్నమయ్య జిల్లాలో ఇంధన కొరత లేదని, కృత్రిమంగా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం హెచ్చరించారు. ఎస్పీ ధీరజ్ తో కలిసి రాయచోటి, గుర్రంకొండ, చిన్నమండెం మండలాల్లోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టాక్, సరఫరా, వాహనదారుల క్యూల పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా సమస్యలు లేవని నిర్వాహకులు, వినియోగదారులు తెలిపారు. 'ఇంధనం లేదు' అంటూ ఇబ్బంది పెట్టడం తగదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్