అన్నమయ్య జిల్లా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ తదితర అధికారులు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద మంత్రులను ఆహ్వానించారు. తరువాత మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.