రాయచోటిలో రాజకీయ దాడులపై వైఎస్ఆర్ సీపీ ఆగ్రహం

9చూసినవారు
రాయచోటిలో రాజకీయ దాడులపై వైఎస్ఆర్ సీపీ ఆగ్రహం
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి శనివారం మాట్లాడుతూ, వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా నిలుస్తున్న కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆటవిక పాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని, రామాపురం మండలం చిట్లూరు గ్రామానికి చెందిన రామచంద్రపై నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం హేయమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రశ్నించిన వారిపై హత్యాయత్నాలు చేయడం ఏ రాజకీయమని ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్