రాయచోటి - Rayachoti

రెండో తరగతి విద్యార్థిని కొట్టిన టీచర్ పై ఫిర్యాదు

రెండో తరగతి విద్యార్థిని కొట్టిన టీచర్ పై ఫిర్యాదు

రాయచోటిలోని శ్రీచైతన్య స్కూల్ (4 బ్రాంచ్)లో 2వ తరగతి చదువుతున్న సమీహా (7) అనే విద్యార్థిని, నోట్ బుక్‌లో ఒక పదాన్ని తప్పుగా రాసినందుకు టీచర్ విశ్వదీప్ వాతలు వచ్చేలా కొట్టారని సంబేపల్లె మండలం దేవ పట్లకు చెందిన విద్యార్థి తల్లి పెద్దపుత్త నబియా బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తన కుమార్తె సమీహా పాఠశాల నుండి ఇంటికి వచ్చి నీరసంగా కనిపించడంతో, టీచర్ కొట్టారని తెలిపింది. రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తల్లి, టీచర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా