
రామాపురం: శ్రావణి కు ఐఏఆర్‌ఐలో డాక్టరేట్ పట్టా
రామాపురం మండలం బండపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి శ్రావణి, ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) నుంచి గురువారం డాక్టరేట్ పట్టా పొందారు. దక్షిణ భారతదేశ గ్రామీణ కూలీల పోషక స్థితిపై ఆమె చేసిన విశ్లేషణాత్మక పరిశోధనకు గాను ఈ గౌరవం లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చేతుల మీదుగా ఆమెకు పట్టా ప్రదానం చేశారు. గతంలో శ్రావణి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు.







































