
ములకలచెరువులో అనాధ శవానికి ఎస్సై నరసింహుడు అంత్యక్రియలు
ములకలచెరువు మండలం కదిరినాధుని కోట గ్రామం గాలేటివారిపల్లిలో మంగళవారం ఒక అనాధ వృద్ధుడు మృతి చెందాడు. వారసులు లేరని తెలుసుకున్న ఎస్సై నరసింహుడు స్వయంగా పాడిమోసి సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సై చేసిన ఈ మానవతా సేవకు స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో డా. కళ్యాణ్, కోనంగి శ్రీనివాసులు, కోనంగి హరీష్, డేరంగుల మస్తాన్, పూజారి హనుమంతు, ప్రశాంత్, విష్ణు, జహీర్ తదితరులు పాల్గొన్నారు.




































