బి. కొత్తకోట: ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - సుగవాసి

5చూసినవారు
బి. కొత్తకోట: ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - సుగవాసి
గురువారం కొత్తకోట క్లస్టర్-8 మహానాడు వేదికగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, ఎమ్మెల్సీ కల్యాణ్ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. సుగవాసి మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన మహానేత అని కొనియాడారు. చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you