రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా తంబళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం మదనపల్లి వన్ డిపో అధికారులు తగిన బస్సు సర్వీసులను నడపాలని మల్లయ్య కొండ భక్తులు, తంబళ్లపల్లి గ్రామ ప్రజలు మదనపల్లి వన్ డిపో మేనేజర్ మూర వెంకటరమణారెడ్డిని కోరుతున్నారు.