కుటుంబ సమస్యల కారణంగా వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సింగన్న గారి పల్లెకు చెందిన ఆంజనేయులు (45) కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపంతో ఇంట్లోనే ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు వెంటనే గమనించి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.