మొలకలచెరువు మండలం ఉచ్చోల్లపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నందిని (15) అనే బాలిక చెరువు గట్టున బట్టలు ఉతకడానికి వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందింది. మృతురాలు బి. కొత్తకోట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 9వ తరగతి చదువుతున్నట్లు అధికారులు గుర్తించారు. చెరువులో మునిగిపోతున్న బాలికను గమనించే లోపే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.