బుధవారం, తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండ పుణ్యక్షేత్రంలో మైనింగ్ చేయడానికి ప్రయత్నించిన వారు సర్వనాశనం అయిపోతారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి హెచ్చరించారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చే ఈ మహిమగల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి, డబ్బుల కోసం కొండను కొట్టేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొండ జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.