అడవులకు నిప్పు పెట్టడం వల్ల సకల ప్రాణకోటికి ముప్పు వాటిల్లుతుందని ఎఫ్ఎస్ఓ సమీమ్ తాజ్ హెచ్చరించారు. మంగళవారం ములకలచెరువు మండలంలోని పెద్దపాలెం, అంగటువారిపల్లె గ్రామాల్లో అటవీ సిబ్బందితో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణపై రైతులకు వివరించారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా ప్రజలు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఈ సదస్సులో అటవీ సిబ్బందితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.