ములకలచెరువు: అకస్మాత్తుగా దంచికొట్టిన వర్షం

12చూసినవారు
ములకలచెరువు మండలంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పగటిపూట తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్నిచ్చింది. అయితే, ఆకస్మిక వర్షం వల్ల చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల నిర్వాహకులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్