పెద్దతిప్పసముద్రంలోని శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూపాకేశ్వర స్వామి ఆలయంలో ఆలయ సేవకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో సోమవారం శివలింగానికి పంచామృతాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. వేదపండితులచే ప్రత్యేక అలంకరణతో సప్తహారతి, నక్షత్ర హారతి, పంచహారతి, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.