పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

1898చూసినవారు
గురువారం పెద్ద తిప్ప సముద్రం మండలంలోని బూర్లపల్లి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యార్థుల వర్క్‌బుక్స్, భోజన నాణ్యత, తరగతి గదులు, వంటశాల, తాగునీటి వసతులను పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి నెలా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్