అన్నమయ్య జిల్లా డిఎల్ డిఓ అమరనాథ్ రెడ్డి శుక్రవారం తంబళ్లపల్లె మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బోధన సామర్ధ్యాలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేయాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని ఆయన సూచించారు. 100% ఫలితాల సాధనకు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పాఠాలు చెప్పి, వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని కోరారు.