రామసముద్రం: ట్రాక్టర్ ఢీకొని వృద్ధ వ్యాపారి మృతి

2చూసినవారు
రామసముద్రం: ట్రాక్టర్ ఢీకొని వృద్ధ వ్యాపారి మృతి
రామసముద్రం మండలం దిగువపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన 70 ఏళ్ల చిరు వ్యాపారి ఖాదర్ వలీ మృతి చెందారు. ఖాదర్ వలీ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ట్రాలీ ఢీకొనడంతో ఆయన ట్రాలీ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా పుంగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :