అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కిరణ్, కానిస్టేబుల్ కిరణ్‌లను బుధవారం ఎస్పీ ధీరజ్ సస్పెండ్ చేశారు. ఒక కేసులో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎస్పీ, ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. పోలీస్ శాఖలో అవినీతిని సహించబోమని ఎస్పీ హెచ్చరించారు.