పెద్దతిప్పసముద్రంలో గాయత్రి దేవికి వైభవంగా ప్రత్యేక పూజలు

8చూసినవారు
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రంలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతి సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో, ఆలయ సేవకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గాయత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి దేవి విగ్రహానికి పంచామృతాభిషేకం, గాయత్రీ హోమం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు జరిగాయి. వేద పండితులచే అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో పంచహారతి, సప్తహారతి, నక్షత్రహారతి, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్