హార్స్లీ హిల్స్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

0చూసినవారు
హార్స్లీ హిల్స్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
బి. కొత్తకోటలోని హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రెండు గంటల్లోనే రూ. 52 వేల జరిమానా వసూలు చేసి, 13 వాహనాలపై కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేశారు. యువకులు అతివేగంగా నడపడం, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం, హెల్మెట్ లేకపోవడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా ఇకపై నిరంతరం తనిఖీలు ఉంటాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్