కరెంట్ షాక్‌తో విద్యార్థి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

7చూసినవారు
కరెంట్ షాక్‌తో విద్యార్థి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
ఆదివారం సాయంత్రం రామసముద్రం మండలంలో విద్యార్థి చందు (14) కరెంట్ షాక్‌కు గురై పరిస్థితి విషమంగా మారింది. చెంబకూరు పంచాయతీ ఎర్రబయలుపల్లెకు చెందిన చందు, గ్రామంలోని గుడికి హారం వేయడానికి పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్