తంబళ్లపల్లె: స్కూటర్ ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు

5చూసినవారు
ఆదివారం తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న జయప్రకాష్ (15) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన నిలబడి ఉండగా, ముదివేడు వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో జయప్రకాష్ కాలు విరిగి పరిస్థితి విషమించడంతో, అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రి నుండి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్