అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, తెట్టు హరిజనవాడలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు మోటార్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. 20 రోజుల క్రితం గ్రామ సెక్రెటరీకి అర్జీ పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.