Apr 08, 2026, 05:04 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
పరిశుభ్రతపై కౌన్సిలర్ బెజ్జల శ్యామల పిలుపు: కాలనీవాసులకు సూచనలు
Apr 08, 2026, 05:04 IST
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు జవహర్ నగర్ కాలనీలో బుధవారం వార్డు కౌన్సిలర్ బెజ్జల శ్యామల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి సైడ్ కాలువలను శుభ్రం చేయించారు. కాలనీవాసుల ఆరోగ్యం దృష్ట్యా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కౌన్సిలర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.