ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల మాటలు నమ్మి, చైనాకు అవసరమైన ఎంట్రీ పర్మిట్లు, వీసాలు లేకుండా కైలాస్-మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన 52 మంది భారతీయ పౌరులు నేపాల్‌లో చిక్కుకుపోయారు. వీరిని రక్షించాలంటూ వారు విదేశాంగ శాఖను ఆశ్రయించడంతో, కేంద్ర ప్రభుత్వం తాజాగా అడ్వైజరీని విడుదల చేసింది. అవసరమైన ప్రయాణ పత్రాలు చేతికి వచ్చేంత వరకు ప్రయాణాన్ని ప్రారంభించవద్దని, సరైన ఆపరేటర్లను ధృవీకరించుకోవాలని సూచించింది. ఈ యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా ఆరోగ్య
పరీక్షలు చేయించుకోవాలి, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.