ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ పరిధి వాసాలతిప్పకు చెందిన కర్రి లీలాకృష్ణ(39) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఆక్వాసాగు చేసే లీలా కృష్ణ చెరువులోని పండుగప్ప చేపలకు ఆహారంగా అందించే చైనా గొరకల కోసం సోదరుడితో కలిసి శుక్రవారం వేటకు వెళ్లారు. అదే సమయంలో వర్షం కురిసి పిడుగుపాటుకు గురయ్యాడు. సోదరుడు, చుట్టుపక్కల వారు కలిసి గట్టుపైకి తీసుకు రాగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.