
జగ్గంపేట: కాపు సంఘ అధ్యక్షుడిగా చిన్నబాబు
జగ్గంపేట కాపు సంక్షేమ భవనంలో సోమవారం సాయంత్రం జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీసాల చిన్నబాబు అధ్యక్షుడిగా, తోలేటి సూర్య నారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తులా నరసింహారావు, మారిశెట్టి రాధా, తోట బుచ్చిరాజు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. సంఘాన్ని బలోపేతం చేసి ఐకమత్యంతో ముందుకు సాగాలని పలువురు సభ్యులు కోరారు.







































