జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడి దుర్మరణం

815చూసినవారు
జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడి దుర్మరణం
గండేపల్లి మండలం బొర్రంపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల అడపా విఘ్నేష్ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై అన్నవరం వైపు వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విఘ్నేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు వాహనం వెనుక కూర్చున్న మహిళ స్వల్పంగా గాయపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్