అకాల వర్షాల కారణంగా ఏలేరు జలాశయం నిండుకుండలా మారడంతో, శుక్రవారం రాత్రి 2100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం తెలిపారు. కృష్ణవరం, ఎస్. తిమ్మాపురం, శృంగారాయుని పాలెం, భూపాలపట్నం, రాజుపాలెం గ్రామాలకు ముంపు ప్రమాదం ఉన్నందున ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.