గండేపల్లి: ఈ- పంట నమోదు పొడిగింపు

1357చూసినవారు
గండేపల్లి: ఈ- పంట నమోదు పొడిగింపు
జిల్లా వ్యవసాయాధికారి ఎన్. విజయ్ కుమార్ గండేపల్లి వ్యవసాయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, ఈ పంట నమోదు ప్రక్రియను అక్టోబర్ 25 లోపు పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి ల్యాండ్ పార్సిల్ ను ఈ పంట నమోదులోకి తీసుకురావాలని, వరి, పామాయిల్ తో పాటు ఇతర పంటలను కూడా నమోదు చేయాలని సూచించారు. గ్రామ కంఠం, వ్యవసాయేతర భూములను కూడా ఈ పంట నమోదులో చేర్చాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్