గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారులోని చక్రవర్తి నగర్ ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. వేగంగా వచ్చిన కారు, ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని వరి కోత మిషన్ డ్రైవర్‌గా పనిచేసే సంజుగా గుర్తించారు. ఈ ఘటనపై స్థానికులు వివరాలు తెలిపారు.