గండేపల్లి: తాళ్లూరు లిఫ్ట్ కు రూ. 52 కోట్లు మంజూరు

1051చూసినవారు
గండేపల్లి మండలం తాళ్లూరు లిఫ్ట్ కు ఎంఎస్ ఐరన్ పైప్లాన్ వేసేందుకు ప్రభుత్వం రూ. 52 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం తెలిపారు. మల్లవరం ఎత్తిపోతల పథకానికి రూ. 140 కోట్ల పరిపాలన ఆమోదం మరో 10 రోజుల్లో లభిస్తుందని, ఈ నిధులు ఈ ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.